ఓలా ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2 కిలోవాట్, 3 కిలోవాట్, 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. ఓలా ఎస్1 ఎక్స్‌లో కూడా హబ్ మౌంటెడ్ మోటార్ ఉంది. 2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వర్షెన్ గంటకు 85 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 95 కిలోమీటర్ల వరకు రేంజ్‌ని ఇస్తుంది. 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ప్రొపెల్డ్ వేరియంట్ 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో ఫుల్ ఛార్జ్ చేస్తే 151 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఆధారిత వర్షెన్.. 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో, ఫుల్ ఛార్జ్ చేస్తే 193 కిలోమీటర్ల వరకు రేంజ్‌ని ఇస్తుంది.