సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తో తెలుగు సినీ ప్రేక్షకుల్లో గుర్తింపు పొందిన నార్త్ ఇండియన్ భామ ‘రకుల్ ప్రీత్ సింగ్’.ఆ తర్వాత తెలుగు చిత్ర సీమలో ఉన్న అందరి అగ్ర హీరోలతో నటించి టాప్ హీరోయిన్ రేంజ్ ని కూడా వెళ్ళింది.బాలీవుడ్ లో కూడా కొన్ని చిత్రాలు చేసిన రకుల్ ఇటీవల గాయపడిన విషయం అందరకి తెలిసిందే.
ఇప్పుడు ఆమె గాయం నుంచి కోలుకొని తన తదుపరి చిత్రం ‘మేరే హస్బెండ్ కీ బీవీ’ షూటింగ్ లో అడుగుపెట్టింది.ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో రకుల్ మాట్లాడుతు గాయపడిన తర్వాత నా శరీరంపై నాకు గౌరవం పెరిగింది.నేను అందరకి చెప్పేది ఒక్కటే,అతిగా వ్యాయామం చెయ్యకుండా,మీ శరీరం మాట వినండి.గాయం నుంచి కోలుకొని ‘మేరే హస్బెండ్ కీ బీవీ సెట్స్ లోకి అడుగుపెట్టడం ఎంతో ఉద్వేగంగా,ఆనందంగా ఉంది.
‘మేరే హస్బెండ్ కీ బీవీ’కి నా భర్త ‘జాకీ భగ్నానీ’ నే నిర్మిస్తున్నాడు.అందుకే ఈ సినిమా నాకు ప్రత్యేకం.సెట్స్ లో మేము ప్రొఫిషినల్ గానే ఉంటాం అని చెప్పుకొచ్చింది.ఇక ‘మేరే హస్బెండ్ కీ బీవీ’ ని ముదసర్ అజీజ్ దర్శకుడుగా వ్యవహరించగా ఈ నెల 21 న మూవీ విడుదల కానుంది.అర్జున్ కపూర్ హీరోగా చేస్తున్న ఈ మూవీలో భూమి ఫడ్నేకర్ కూడా ఒక హీరోయిన్ గా చేస్తుంది.