అమెరికాలో మరోసారి రెండు విమానాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ప్రైవేట్‌ జెట్‌ను మరో విమానం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. లియర్‌జెట్ 35ఎ విమానం ల్యాండింగ్‌ అయిన తర్వాత రన్‌వే నుంచి జారి, రాంప్‌పై నిలిపి ఉన్న బిజినెస్ జెట్‌ను తగిలింది. ఈ ఘటన ఆరిజోనాలోని స్కాట్‌డేల్‌ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదం మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో జరిగినట్లు సమాచారం. ఈ ఘటనతో ఎయిర్‌పోర్ట్‌లో విమానాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here