మంచి చేయాలనే లక్ష్యంతో..
రాజకీయ ప్రయాజనాలకు అతీతంగా, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే మంచి లక్ష్యంతో ప్రభుత్వం ఉందని.. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో చర్చించి, కేబినెట్ సబ్ కమిటీ వేసి, న్యాయ కమిషన్ వేసి, నివేదికలను వేగంగా తీసుకుని, కేబినెట్లో చర్చించి, అసెంబ్లీలోనే నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి వివరించారు.