మాస్ మహారాజా ‘రవితేజ'(Ravi Teja)హీరోగా 2004 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్'(Naa Autograph Sweet Memories) .రొమాంటిక్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీకి రవితేజ కెరీర్లోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది.ఒక అబ్బాయికి యవ్వన ప్రాయంలో కలిగిన ప్రేమ తాలూకు జ్ఞాపకాలతో పాటు, గతానికి సంబంధించిన విషయాలన్నీ అతనికి అమృతాన్ని నింపుకున్న రోజులుగా గుర్తుకురావడమనేది ఈ మూవీలో చాలా క్లియర్ గా చూపించారు.
ఇప్పుడు ఈ మూవీ ‘మహా శివరాత్రి'(Maha Shivratri)పర్వదినాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 22 న రీ రిలీజ్ కాబోతుంది.ఈ మేరకు మేకర్స్ అధికారకంగా వెల్లడించారు.దీంతో రవితేజ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ని సిల్వర్ స్క్రీన్ పై చూడాలనే ఆసక్తి తో ఉన్నారు.మూవీ లవర్స్ అయితే సోషల్ మీడియా వేదికగా ఎప్పట్నుంచో ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్’ ని రీ రిలీజ్ చెయ్యాలని కోరుతునే ఉన్నారు.
ఇక ఈ మూవీకి ఎన్నో హిట్ సినిమాలకి కెమెరామెన్ గా పని చేసిన ఎస్ గోపాల్ రెడ్డి(s.Gopal reddy)దర్శకత్వం వహించగా అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్(Bellamkonda Suresh)నిర్మాతగా వ్యవహరించాడు.కీరవాణి(Keeravani)అందించిన సంగీతం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.మూవీలోని పాటలు నేటికీ చాలా చోట్ల మారుమోగిపోతుంటాయి.గోపిక, భూమిక,మల్లిక,హీరోయిన్లుగా చేసిన ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్’ చేతన్(Chethan)స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం’ఆటోగ్రాఫ్’ కి రీమేక్ గా రూపొందింది.