మకరం
వ్యవహారానుకూలత, వస్త్ర ప్రాప్తి ఉన్నాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. రావలసిన ధనం అందుతుంది, అవసరాలు నెరవేరుతాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు, పెద్దమొత్తం ధన సహాయం తగదు. అర్దాంతరంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. అనవర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. శుభకార్యానికి హాజరవుతారు.