తెలుగు చిత్ర సీమలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘గీతా ఆర్ట్స్'(Geetha arts)కి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.సుదీర్ఘ కాలం నుంచి నిర్మాణ రంగంలో ఉండి,ఎన్నో హిట్ చిత్రాలని నిర్మించింది.రీసెంట్ గా యువసామ్రాట్ నాగచైతన్య,సాయి పల్లవి జంటగా ‘తండేల్’ ని నిర్మించింది.ఈ నెల 7 న విడుదలైన ఈ మూవీ విజయ పధాన దూసుకుపోతు ఇప్పుడు వంద కోట్ల క్లబ్ లోకి కూడా చేరింది.
ఇక రీసెంట్ గా ‘తండేల్'(Thandel)విజయాన్ని పురస్కరించుకొని చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించగా అక్కినేని నాగార్జున(Nagarjuna)ముఖ్య అతిధిగా హాజరు అయ్యాడు.ఈ సందర్భంగా నాగార్జున నిర్మాత అల్లు అరవింద్ ని ఉద్హేశించి మాట్లాడుతు మాకు 100 %లవ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్,తండేల్ వంటి మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ ని అరవింద్ గారు మాకిచ్చారు.100 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి నిర్మాత కూడా అరవింద్ గారే.గజని ద్వారా ఆయన ఆ ఘనతని సాధించాడని చెప్పడం జరిగింది.
దీంతో నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరు ‘గజని'(Ghajini)మూవీ హిస్టరీ గురించి సెర్చ్ చేస్తున్నారు.సూర్య(suriya)హీరోగా మురుగదాస్(Murugudas)దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన గజని ని, అరవింద్ తన గీతా ఆర్ట్స్ పై తెలుగులోకి డబ్బింగ్ చెయ్యగా హిందీ లో మాత్రం రీమేక్ చేసారు.అమీర్ ఖాన్(Amir Khan)హీరోగా తెరకెక్కగా 2008 లో రిలీజ్ అయ్యింది.65 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా,200 కోట్ల రూపాయిల దాకా వసూలు చేసింది.