రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుటుంబం ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు వెళ్లింది. సంగం ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ముఖేష్ అంబానీ పుణ్యస్నానం ఆచరించారు. 4 తరాలు కలిసి సంగం ఘాట్ వద్ద పూజలు నిర్వహించారు. ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధిక మర్చంట్, తల్లి కోకిలాబెన్ అంబానీలతో కలిసి మహా కుంభమేళాకు చేరుకున్నారు. అంబానీ కుటుంబం స్వామి కైలాసానంద గిరితో కలిసి సంగమంలో స్నానం చేశారు.