ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ దక్షిణాది రాష్ట్రాల పర్యటన ప్రారంభమైంది. “సనాతన ధర్మ పరిరక్షణ” లో భాగంగా కేరళ మరియు తమిళనాడులోని వివిధ పవిత్ర స్థలాలకు తీర్థయాత్ర ప్రారంభించారు. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన తన ప్రయాణంలో శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్షేత్ర సందర్శనలో పవన్ తో పాటు ఆయన కుమారుడు అకీరా, TTD సభ్యుడు ఆనంద సాయి పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here