సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే
“దురదృష్టవశాత్తూ, ఈ ఉచితాల కారణంగా… పని చేయడానికి ప్రజలు సుముఖంగా లేరు. వారికి ఉచిత రేషన్ అందుతోంది. వారు ఏ పనీ చేయకుండానే డబ్బులు తీసుకుంటున్నారు’ అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. నిరాశ్రయులను సమాజంలో ప్రధాన స్రవంతిలో చేర్చి దేశాభివృద్ధికి దోహదపడేలా చూడాలని ధర్మాసనం అభిప్రాయపడింది. “వారి పట్ల మీ శ్రద్ధను మేము చాలా అభినందిస్తున్నాము. కానీ వారిని సమాజంలోని ప్రధాన స్రవంతిలో భాగం చేయడం, దేశ అభివృద్ధిలో వారిని భాగస్వామ్యులను చేయడం మరింత మంచిది కదా” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.