చంద్రబాబు పాలనపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. అమలు చేస్తానన్న పథకాలన్నీ అబద్ధం, మోసమని ఆరోపించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. వచ్చేది జగన్ 2.0 పాలనే అని పునరుద్ఘాటించారు. కార్యకర్తలను ఇబ్బందులు పెట్టినవారిని విడిచిపెట్టే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు.