అద్దంలో చూడడం వల్ల నష్టాలు
పదే పదే అద్దంలో చూసుకోవడం వల్ల ఎన్నో చెడు ప్రభావాలు ఉన్నాయి. అద్దంలో మిమ్మల్ని మీరు తరచుగా చూసుకోవడం వల్ల మీలో ప్రతికూల ఆలోచనలు పుట్టడం ప్రారంభమవుతాయి. ఇది మానసిక అనారోగ్యంగా మారిపోతుంది. అలా అద్దంలో చూసుకునే వ్యక్తులు సమాజం నుండి దూరంగా మారుతారు. ఒంటరిగా మిగిలిపోతారు. స్కూళ్లకు కూడా తక్కువగా వెళ్లాలనిపిస్తుంది. పార్టీలు, వేడుకల్లో పాల్గొనాలని అనిపించదు. క్రమంగా వారు కుటుంబానికి, స్నేహితులకు దూరం అవుతూ ఉంటారు. తమలో ఎన్నో శారీరక లోపాలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు. ఇది ఇలాగే వదిలేస్తే తీవ్రమైన రుగ్మతగా మారిపోతుంది. తమ ముఖంలో ఎలాంటి లోపాలు లేకపోయినా ఏదో ఒక ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేందుకు సిద్ధమైపోతారు.