వాలెంటైన్స్ డే పేరు వింటేనే ప్రేమికుల హృదయాల్లో గులాబీలు విచ్చుకుంటాయి. ఎంతో సున్నితమైన, అందమైన రోజుగా దాన్ని చెప్పుకుంటా.రు కానీ పురాతన రోమన్లలో మాత్రం ఇది సంతానోత్పత్తి పండుగ… అంటే ఆరోజు చేసే కొన్ని పనులు మహిళల్లో సంతాన సామర్థ్యాన్ని పెంచుతాయనే నమ్మకం ఉండేది. ఈ పండుగ వచ్చిందంటే పురాతన రోమన్ స్త్రీలు భయంతో వణికి పోయేవారు.