‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunnam)సినిమాతో ఘన విజయాన్నిఅందుకున్నభామ ఐశ్వర్య రాజేష్.(Aishwarya Rajesh)’భాగ్యం’ అనే క్యారక్టర్ లో ఐశ్వర్య ప్రదర్శించిన నటన,సినిమా విజయంలో ఒక ముఖ్య పాత్ర పోషించిందని కూడా చెప్పవచ్చు.అంతలా ఆమె తన క్యారక్టర్ లో నటించింది.నిజానికి సంక్రాంతికి వస్తున్నాం కంటే ముందు కొన్ని సినిమాల్లో నటించినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు.అలాంటిది ఇప్పుడు తెలుగు వారి ‘భాగ్యం’గా తెలుగు ప్రేక్షకుల మనస్సులో సుస్థిర స్థానాన్ని సంపాదించింది.
రీసెంట్ గా ఐశ్వర్య ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఒక వ్యక్తిని ఇష్టపడి,అతనితో కొన్నాళ్ళు రిలేషన్ లో కూడా ఉన్నాను.కానీ కొన్ని రోజుల తర్వాత అతడి నుంచి వేధింపులు ఎదుర్కోవడంతో రిలేషన్ నుంచి బయటకి వచ్చాను.ఆ తర్వాత ఇంకొకరితో కూడా రిలేషన్ షిప్ కొనసాగించాను.అతని నుంచి కూడా వేధింపులు రావడంతో తప్పుకున్నాను.ప్రస్తుతానికి అయితే సింగిల్ గానే ఉంటున్నాను.కానీ నా లైఫ్ లో జరిగిన రెండు సంఘటనల దృష్ట్యా లవ్ లో పడాలంటే భయం వేస్తుంది.
ఎందుకంటే నేను చాలా ఎమోషనల్.ప్రేమించే సమయం కంటే,బ్రేక్ అప్ అయినప్పుడు వచ్చే బాధ నుంచి బయటకి రావడానికి చాలా సమయం పడుతుందని చెప్పుకొచ్చింది.ప్రస్తుత ఆమె సినీ కెరీర్ విషయానికి వస్తే రెండు తమిళ చిత్రాలు,ఒక కన్నడ చిత్రంలో చేస్తుంది.ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలిపి సుమారు 40 కి పైగా చిత్రాల్లో నటించిన ఐశ్వర్య,ఒకప్పటి తెలుగు నటుడు రాజా(raja)కూతురు.