పన్ను చెల్లింపుదారుల హక్కులు, బాధ్యతలు వివరించే పన్ను చెల్లింపుదారుల చార్టర్ను బిల్లులో చేర్చారు. పన్ను చెల్లింపుదారులు చదవడానికి వీలుగా టేబుల్స్, ఫార్ములాలు పొందుపరిచారు. జీతాల్లో స్టాండర్డ్ డిడక్షన్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్ వంటి తగ్గింపులన్నీ ఒకే చోట ఉంటాయి. గతంలో వివిధ సెక్షన్లు , రకరకాల నిబంధనల్లో ఇవి ఉండేవి.