ప్యాకేజీ వివరాలు….
- ఈనెల 15, 25 తేదీల్లో బస్సులు బయలుదేరుతాయి. యాత్ర ఎనిమిది రోజులు పాటు జరుగుతోంది.
- హిందూపురంలో బయలుదేరే బస్సు హైదరాబాద్ చేరుకుంటుంది. అక్కడ శంషాబాద్‌లోని చిన్న జీయర్ స్వామి నిర్మించిన రామానుజాచార్యుల దేవాలయం, యాదగిరిగుట్ట నరసింహస్వామి దేవస్థానం సందర్శిస్తారు. ఆ తరువాత నిజామాబాద్ సరస్వతీ దేవి ఆలయం (బాసర) సందర్శన ఉంటుంది.
- ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లోని ప్రయాగరాజ్ చేరుకుంటుంది. అక్కడ కుంభమేళాకు హాజరుకావచ్చు. అక్కడ యమున, సరస్వతీ పుణ్యనదుల స్నానం ఉంటుంది.
- ఆ తర్వాత అయోధ్య వెళ్తారు. అక్కడ శ్రీరామ దర్శనం, సీతాదేవి ఇల్లు, జనక మహారాజ్ కోట సందర్శనం ఉంటుంది. ఆ తరువాత కాశీ (వారణాసి) చేరుకుని శ్రీ కాశీ విశ్వేశ్వరుని దర్శనం, కాశీ విశాలాక్షి దర్శనం గంగానది పుణ్యతీర్థ స్నానం, కలబైరవ దర్శనం ఉంటుంది.
అయోధ్యలో ఒక నైట్, కాశీలో రెండు రాత్రులు బస చేస్తారు. అయితే భోజనం, వసతి ఖర్చులు ఎవరిది వారే భరించాల్సి ఉంటుంది. ఏపీఎస్ఆర్టీసీ అందించే ఈ ప్యాకేజీలో ఒక్కొక్క టికెట్ ధర రూ.9,000 ఉంటుంది. ఆసక్తి గల వారు టిక్కెట్టు కావాలనుకుంటే 9440834715 (ఎవీవీ ప్రసాద్), 7382861323 నెంబర్లను సంప్రదించాలి. యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ శ్రీకాంత్ తెలిపారు.