కూటమి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై హత్యాయత్నం జరిగినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఏలూరు త్రీ టౌన్ స్టేషన్లో చింతమనేని డ్రైవర్ ఫిర్యాదు చేశారు. ఆయన డ్రైవర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అయితే చాలా కాలం నుంచి చింతమనేని, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మధ్య గొడవలు నడుస్తున్నాయి.