మంచు విష్ణు(Vishnu)టైటిల్ రోల్ లో పరమేశ్వరుడి పరమ భక్తుడైన ‘భక్త కన్నప్ప’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘కన్నప్ప'(Kannappa)పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్న ఈ మూవీలో ప్రభాస్(Prabhas)మోహన్ లాల్(MOhanlal)అక్షయ్ కుమార్(Akshay Kumar)మోహన్ బాబు(MOhan babu)వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.ఏప్రిల్ 10 న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న ఈ మూవీకి ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh)దర్శకుడు కాగా మోహన్ బాబు,విష్ణులే నిర్మాతలుగా వ్యవహరించారు.
రీసెంట్ గా విష్ణు ఒక ఆంగ్ల మీడియాతో మాట్లాడుతు ప్రభాస్,మోహన్ లాల్ గారు కథ చెప్పగానే అంగీకరించి,షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందని అడిగారు.మూవీలో చేసినందుకు ఇద్దరు కూడా ఒక్క రూపాయి రెమ్యునరేషన్ తీసుకోలేదు.మోహన్ లాల్ గారి దగ్గరకి వెళ్లి రెమ్యునరేషన్ గురించి మీ మేనేజర్ తో మాట్లాడమంటారా అని అడిగితే,అప్పుడే అంత పెద్ద వాడివి అయ్యావా అని అన్నారు.నాన్న మోహన్ బాబు వల్లే ఆ ఇద్దరు రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించారు. ప్రభాస్ వల్ల స్నేహం మీద మరింత నమ్మకంపెరిగిందని చెప్పుకొచ్చాడు.
ఇక ఈ మూవీలో ప్రీతి ముకుంద్(Preity Mukhundhan)హీరోయిన్ గా చేస్తుండగా,కాజల్ అగర్వాల్ పార్వతీదేవిగాను,బ్రహ్మానందం,శరత్ కుమార్,శివరాజ్ కుమార్,తదితరులు కీలక పాత్రల్లోను చేస్తున్నారు.స్టీఫెన్ దేవస్సే, మణిశర్మ కలిసి సంగీతాన్ని అందించగా, దాదాపు 140 కోట్ల భారీ వ్యయంతో కన్నప్ప నిర్మాణం జరుపుకుంది.