గత ఆరు నెలలుగా రకరకాల మలుపులు తిరుగుతూ ఎవరికీ అంతుబట్టని విధంగా సాగుతోంది లావణ్య, రాజ్‌ తరుణ్‌, మస్తాన్‌ సాయి కేసు. సినిమా కథలో మించిన ట్విస్టులతో ఎప్పటికప్పుడు కొత్త కథలు, కథనాలతో అందర్నీ రక్తి కట్టిస్తోంది. మొదట రాజ్‌తరుణ్‌పై కేసు పెట్టి మీడియాలో రచ్చ చేసిన లావణ్య.. ఆ తర్వాత అతనికి సారీ చెప్పింది. తాజాగా మస్తాన్‌ సాయిని టార్గెట్‌ చేస్తూ కేసు నమోదు చేయడమే కాకుండా, అతని దగ్గర ఉన్న అమ్మాయిల వీడియోలకు సంబంధించిన హార్డ్‌ డిస్క్‌ను పోలీసులకు అందించింది. మస్తాన్‌ సాయి వల్ల, శేఖర్‌ బాషా వల్ల తనకు ప్రాణహాని ఉందని, తనని వాళ్ళు చంపేస్తారని వణికిపోతోంది. 

తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నీటి పర్యంతమైంది లావణ్య. తను చాలా తప్పు చేసానని ఒప్పుకుంది. రాజ్‌తరుణ్‌తో కలిసి ఉన్న 15 సంవత్సరాలు  ఎంతో హ్యాపీగా ఉండేదని, ఎప్పుడైతే మస్తాన్‌ సాయి తమ జీవితంలోకి వచ్చాడో అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయని తెలిపింది. మొదట రాజ్‌ తరుణ్‌పై కేసు పెట్టడానికి కారణం కూడా మస్తాన్‌ సాయేనని తెలిపింది. మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్‌ నడుపుతున్నాడని నన్ను రెచ్చగొట్టి రాజ్‌ తరుణ్‌పై కేసు పెట్టించాడని ఆరోపించింది. మూడు, నాలుగు నెలలు గడిచిన తర్వాత తనకు విషయం అర్థమై రాజ్‌తరుణ్‌కి సారీ చెప్పింది లావణ్య. అతను తన ముందు ఉంటే అతని కాళ్లు పట్టుకొని క్షమించమని వేడుకునే దాన్నంటూ కన్నీళ్లు పెట్టుకుంది. 

‘మస్తాన్‌ సాయి వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. అతనితో చేసిన చిన్న తప్పు వల్ల నన్ను వీడియో తీసి బ్లాక్‌ చేయడం మొదలుపెట్టాడు. అలాగే అతనితో కలిసి పార్టీకి వెళ్లినపుడు డ్రగ్స్‌ కూడా అలవాటు చేశాడు. డ్రగ్స్‌ కావచ్చు, సెక్స్‌ కావచ్చు.. ఈ రెండిరటిలో తప్పు చేస్తే ఎవరూ క్షమించరు, ఎవరూ సపోర్ట్‌ చేయరు. అందుకే నేను మహిళ అయినప్పటికీ ఏ మహిళా సంఘాలూ నాకు సపోర్ట్‌ చేయడం లేదు. ఎందుకంటే నేను చేసిన తప్పులు అలాంటివి. నేను ఫైనల్‌గా చెప్పదలుచుకున్నది ఒక్కటే. మస్తాన్‌ సాయి వంటి వారి వలలో ఎంతో మంది జీవితాలు నాశనం అయ్యాయి. నాకు తెలిసి నాతోపాటు 40కి పైగా అమ్మాయిల వీడియోలు అతని దగ్గర ఉన్నాయి. ఇకపై నాలా మరో అమ్మాయి నష్టపోకూడదు అని కోరుకుంటున్నాను’ అని వేడుకుంటోంది లావణ్య. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here