కొద్ది రోజులుగా మంచు కుటుంబంలో విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒక వైపు, మంచు మనోజ్ మరో వైపు అన్నట్టుగా విభేదాలు నడుస్తున్నాయి. మొదట హైదరాబాద్ లో మోహన్ బాబు నివాసం దగ్గర, ఆ తర్వాత తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ సాక్షిగా ఈ గొడవలు జరిగాయి. ఈ వివాదానికి కారణం ఆస్తి తగాదాలే అని ప్రచారం జరుగుతోంది. మనోజ్ మాత్రం తన గొడవ ఆస్తి కోసం కాదని చెప్పాడు. ఈ క్రమంలో మరోసారి తాజాగా మనోజ్ ప్రెస్ మీట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. (Manchu Manoj)

 

‘జగన్నాథ్‌’ సినిమా టీజర్‌ లాంచ్‌ కార్యక్రమం కోసం మనోజ్ రాయలసీమ వెళ్ళాడు. ఈ క్రమంలో తన వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుపుతూ మనోజ్ కీలక ప్రెస్ మీట్ పెట్టాడు. తన తండ్రి మోహన్ బాబు గారు యూనివర్సిటీ వ్యవహారాలు చూసుకున్నంత కాలం బాగుందని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నాడు. బౌన్సర్లను పెట్టి తన వాళ్ళను, ఇక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించాడు. స్టూడెంట్స్ ఉన్నప్పుడు తాగి గొడవలు పడే బౌన్సర్లు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించాడు. వారి వల్ల స్థానికులు కూడా భయపడుతున్నారని అన్నాడు. పోలీసులు, ప్రభుత్వం ఈ విషయం మీద దృష్టి పెట్టి, ఇక్కడి వారికి అండగా ఉండాలని మనోజ్ కోరాడు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here