Free JioHotstar: హాట్ స్టార్ తో విలీనం తర్వాత జియో అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో హాట్ స్టార్ ఓటీటీ సేవలను ప్రారంభించింది. కంపెనీ అధికారిక వెబ్సైట్ కూడా ప్రారంభమైంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, ఐప్యాడ్ఓఎస్, స్మార్ట్ టీవీలతో సహా అనేక ప్లాట్ ఫామ్ లలో తన యాప్ ను రీబ్రాండ్ చేసింది. రీబ్రాండింగ్ తో పాటు, జియో హాట్ స్టార్ కోసం సబ్స్క్రిప్షన్ ప్లాన్లను కూా జియో ఆవిష్కరించింది. వీటిని జియో హాట్ స్టార్ అధికారిక వెబ్సైట్ లో చెక్ చేయవచ్చు. అయితే, కొంతమంది అదృష్టవంతులైన వినియోగదారులు జియో హాట్ స్టార్ కు కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ పొందారు.