గడ్డ పెరుగు పెట్టేందుకు చిట్కాలు
మార్కెట్‌లో దొరికేలా గడ్డ పెరుగును త్వరగా తయారు చేయడానికి, ముందుగా పాలు వేడి చేయడానికి గ్యాస్ మీద ఉంచండి. పాలు మరిగేంత వరకు ఉడికించండి. పాలు బాగా మరిగితే పెరుగు గట్టిగా వస్తుంది. పాలు కాస్త వెచ్చగా అయినప్పుడు పెరుగు చేసేందుకు సిద్ధమవ్వాలి. గోరువెచ్చని పాలల్లో ఒక చెంచా పెరుగు వేసి బాగా కలపండి. ఇక్కడ వరకు ప్రక్రియ మీరు సాధారణంగా పెరుగు పెట్టే విధంగానే ఉంటుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, మీకు ఎక్కువ పుల్లని పెరుగు కావాలంటే, పుల్లని పెరుగునే తోడు వేయండి.