యుక్త వయస్సు వారికి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అవగాహన ఎందుకంటే..

ప్రపంచ ఆరోగ్య సంస్థ లైంగిక ఆరోగ్యాన్ని “లైంగికతకు సంబంధించి శారీరక, భావోద్వేగ, మానసిక, సామాజిక శ్రేయస్సు స్థితి”గా నిర్వచించింది. ఇది కేవలం వ్యాధి లేకపోవడం, పనిచేయకపోవడం లేదా బలహీనత కాదు. లైంగిక ఆరోగ్యానికి లైంగికత, లైంగిక సంబంధాలకు సానుకూల-గౌరవప్రదమైన విధానం. అంతేకాదు ‘బలవంతం, వివక్షత, హింస’ లేని ఆహ్లాదకరమైన, సురక్షితమైన లైంగిక అనుభవాలను పొందేందుకు ఇది చాలా అవసరం కూడా. లైంగిక ఆరోగ్యాన్ని సాధించడానికి, ఇందులో పాల్గొనడానికి.. ప్రతి ఒక్కరి లైంగిక హక్కులను గౌరవించాలి, రక్షించాలి, నెరవేర్చాలి. యుక్తవయస్కులు పరిపక్వతతో తమ శరీరాలపై స్వయంప్రతిపత్తిని నొక్కి చెప్పడం ప్రారంభించినప్పుడే అలాంటి సంబంధాలు పరస్పరం, స్పష్టంగా, న్యాయంగా ఉంటాయని కూడా వారు గుర్తించాలి. వారు తమ లైంగిక సంబంధాలలో సమ్మతి, అనుమతి, పరస్పర గౌరవం యొక్క ప్రాముఖ్యతను నేర్చుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here