రచయితగా సినీకెరీర్ ని మొదలుపెట్టి నటుడుగా,దర్శకుడుగా,తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటు ఒక ప్రత్యేకతని చాటుకున్నారు పోసాని కృష్ణమురళి.ఆయన డైలాగ్ డెలివరీకి,బాడీ లాంగ్వేజ్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది.కాకపోతే గత కొంత కాలంగా సినిమాల్లో కనిపించటం లేదు.
పోసాని గత వైసిపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)మంత్రులైన లోకేష్(Lokesh)పవన్(Pawan) లపై సభ్య సమాజం తలదించుకునేలా అనుచిత వ్యాఖ్యలు చేసాడు.ఈ నేపథ్యంలో తెలుగుదేశం ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోసాని ని అరెస్ట్ చేస్తారనే ప్రచారం కొనసాగింది.కానీ అలాంటిదేమి జరగలేదు.ఇటీవల గన్నవరం మాజీ ఏంఎల్ఏ వల్లభనేని వంశీ భూకబ్జాలు,బెదిరింపులు చేసాడని రుజువ్వడంతో కోర్టు జైలుకి తరలించింది.ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో పోసాని అరెస్ట్ పై చర్చ జరుగుతుంది.
పోసాని సుమారు ఒక 150 సినిమాల దాకా పని చెయ్యడం జరిగింది.1993 లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘గాయం’పోసాని ఫస్ట్ మూవీ.గత కొన్ని రోజుల క్రితం ఆయన అనారోగ్యం బారిన పడ్డాడనే వార్తలు ప్రచురితమయ్యాయి.