ఎస్సీ, ఎస్టీలకు 27% రిజ‌ర్వేష‌న్లు పోగా…మిగిలిన 23% బీసీలకు క‌ల్పిస్తార‌ని ప్రచారం జ‌రిగింది. అయితే ఈ ఊహాగాల‌నాల‌కు తెర దించుతూ బీసీలకు రాజ‌కీయంగా, విద్య, ఉద్యోగాల్లో 42% రిజ‌ర్వేష‌న్ల కల్పించేందుకు మార్చి మొద‌టి వారంలో చ‌ట్టం చేస్తామ‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క సంచ‌ల‌న ప్రక‌ట‌న చేశారు. దీంతో ఈ విష‌యంలో బీఆర్ఎస్‌, బీజేపీలకు కాంగ్రెస్ చెక్ పెట్టగ‌లిగింద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. అంతేకాకుండా రాష్ట్రం ఆమోదించిన చ‌ట్టాన్ని కేంద్రానికి పంపి 9వ షెడ్యూల్‌లో పొందుపరిచి త‌మిళ‌నాడు త‌ర‌హా రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాలని కాంగ్రెస్ భావిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here