గ్లోబల్ స్టార్ ‘రామ్ చరణ్'(Ram Charan)సతీమణి ‘ఉపాసన'(Upasana)సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలన్నింటిని షేర్ చేసుకుంటు ఎంతో మంది ఫాలోవర్స్ ని కూడా సంపాదించింది.రీసెంట్ గా తమ పెంపుడు చిలుక తప్పిపోయిందని ఉపాసన పోస్ట్ చెయ్యడం,కొంత మంది ఆ చిలుక ని తెచ్చి ఇవ్వడం కూడా జరిగింది.
ఇక ఈ రోజు ‘వాలంటైన్స్ డే’ సందర్భంగా ఉపాసన ఒక పోస్ట్ షేర్ చేసింది.వాలెంటైన్స్ డే అనేది 22 సంవత్సరాల వయసులోపు ఉన్న అమ్మాయిలు చేసుకునేది.మీరు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారు అయితే, ఆంటీ ఇంటెర్నేషనల్ ఉమెన్స్ డే కోసం మీరు ఎదురుచూడండి అంటూ ఇనిస్టాగ్రమ్ వేదికగా సరదాగా పోస్ట్ చేసింది.ఇప్పుడు ఆ పోస్ట్ నెటిజన్స్ ని నవ్వులతో ముంచెత్తుతుంది.