కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్,నటప్రపూర్ణ మంచు మోహన్ బాబు(MOhan Babu)తెలుగు సినిమా పరిశ్రమలో చూడని విజయం లేదు,సృష్టించని రికార్డు లేదు.హీరోగా,విలన్ గా,కమెడియన్ గా,క్యారక్టర్ ఆర్టిస్టుగా,నిర్మాతగా సినీ కళామ తల్లి ఒడిలో ఐదు దశాబ్దాలుగా కొనసాగుతు వస్తున్నారు.ప్రస్తుతం తన కొడుకు విష్ణు ప్రధాన పాత్రల్లో ‘కన్నప్ప'(Kannappa)ని తెరకెక్కిస్తున్నాడు.పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్న ఈ మూవీలో మోహన్ బాబు కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.
రీసెంట్ గా విష్ణు(Vishnu)ఒక తమిళ మీడియాతో మాట్లాడుతు మా నాన్న మోహన్ బాబు బయోపిక్ ని ఇప్పటికిప్పుడు తెరకెక్కించాలనే ఆలోచన లేదు.కానీ భవిష్యత్ లో మాత్రం ఖచ్చితంగా తెరకెక్కిస్తాను.కాకపోతే అందులో నేను హీరోగా నటించను.ఎందుకంటే నా తండ్రి క్యారక్టర్ కి పూర్తి స్థాయిలో నేను న్యాయం చేయలేను.సూర్య అయితే నాన్నగారి క్యారక్టర్ కి న్యాయం చేయగలడని చెప్పుకొచ్చాడు.ఇప్పుడు ఈ మాటలు మోహన్ బాబు అభిమానులని ఎంతో ఆనందానికి గురి చేస్తున్నాయి.సూర్య(Suriya)పర్ఫెక్ట్ ఛాయస్ అంటు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ కూడా చేస్తున్నారు.
కన్నప్ప ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ గా విడుదల కానుండగా తెలుగుతో పాటు అన్ని భాషలకి చెందిన ప్రమోషన్స్ ఇప్పుడప్పుడే స్పీడ్ అందుకున్నాయి.ఇటీవల రిలీజైన’శివశివశంకర సాంగ్’ ప్రేక్షకులని విశేషంగా ఆకర్షించడమే కాకుండా,సినిమా మీద అంచనాలని కూడా పెంచింది.ప్రభాస్,మోహన్ లాల్,అక్షయ్ కుమార్,శరత్ కుమార్ వంటి స్టార్స్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తుండగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు.ప్రీతి ముకుందన్ హీరోయిన్ కాగా కాజల్ పార్వతి దేవి గా చేస్తుంది.పరమేశ్వరుడి పరమ భక్తుడైన ‘భక్త కన్నప్ప’ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.