స్టార్ హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna)సినీజర్నీగురించి అందరకి తెలిసిందే.’ఛలో’తో మొదలైన ఆమె   ప్రయాణం,’చావా’ వరకు వరుస విజయాలతో కొనసాగుతుంది.ఆయా సినిమాల్లోని క్యారక్టర్ ల ద్వారా ప్రేక్షకుల్లో తన కంటు ఒక ప్రత్యేక గుర్తింపు ని కూడా తెచ్చుకుంది.రీసెంట్ గా ముంబై లో ‘చావా'(Chhaava)కి సంబంధించిన ఒక కార్యక్రమం జరిగింది.అందులో రష్మిక మాట్లాడుతు హైదరాబాద్ నుంచి వచ్చిన నాపై నార్త్ ప్రేక్షకులు చూపిస్తున్న ఆధారాభిమానాలకి చాలా ధన్యవాదాలు అని చెప్పుకొచ్చింది. 

ఇప్పుడు రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలపై కొంత మంది కన్నడ ప్రజలు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తు’విరాజ్ పేట్ హైదరాబాద్ కి వచ్చిన సంగతి మాకు తెలియలేదే.వేరే ఏరియాలో ఉన్నప్పుడు సొంత ప్రాంతం గురించి చెప్పుకోవడానికి వచ్చిన ఇబ్బంది ఏంటంటు ట్వీట్స్ చేస్తున్నారు.రష్మిక సొంత ప్రాంతం కర్ణాటకలోని విరాజ్ పేట్.కొడగు జిల్లాలో ఆ ఊరు ఉంది. అందుకే ఇప్పుడు కొంత మంది కన్నడ వాసులు రష్మిక పై మండి పడుతున్నారు. సోషల్ మీడియాలో తన పై వచ్చే ప్రతి విషయం మీద రష్మిక  వెంటనే స్పందిస్తుంది.ఈ నేపథ్యంలో  తన సొంత రాష్ట్రం వాళ్ళు తనపై చేస్తున్న వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తుందో చూడాలి. 

రష్మిక ఇప్పుడు కెరీర్ పరంగా చాలా బిజీగా ఉంది.సల్మాన్ ఖాన్ తో చేస్తున్న’సికందర్’తో పాటు నాగ్(Nagarjuna)ధనుష్(Dhanush)ల కుబేర, ‘ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో,వంటి బడా ప్రాజెక్ట్స్ ఆమె ఖాతాలో  ఉన్నాయి.ఇవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు కావడంతో రష్మిక హవా ఇప్పట్లో మాత్రం తగ్గేలా లేదు.చావాలో తాను పోషించిన యేసుబాయి క్యారక్టర్ కి  ప్రేక్షకులు,విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here