మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కథానాయకుడిగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ కి కూడా మంచి స్పందనే లభించింది. ఈ మూవీ రిలీజ్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి సర్ ప్రైజ్ అప్డేట్ వచ్చింది.
విశ్వంభర షూటింగ్ అప్డేట్ ఇస్తూ తాజాగా ఒక పవర్ ఫుల్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. పోస్టర్ లో చిరంజీవి లుక్ అదిరిపోయింది. అలాగే శోభి మాస్టర్ కొరియోగ్రఫీలో మెగాస్టార్ ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని మేకర్స్ తెలిపారు. కీరవాణి సెన్సేషనల్ ట్యూన్ తో, మెగాస్టార్ డ్యాన్స్ తో ఈ సాంగ్ ట్రీట్ లా ఉంటుందని పేర్కొన్నారు.
ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ‘విశ్వంభర’ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తోంది. ఛోటా కె. నాయుడు కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్స్ గా కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి వ్యవహరిస్తున్నారు.