కమిటీ సభ్యులు వీరే..
ఈ కమిటీలో రాష్ట్ర పోలీసు చీఫ్ రష్మీ శుక్లాతో పాటు మహిళా శిశు సంక్షేమం, న్యాయ, మైనారిటీ సంక్షేమం, సామాజిక న్యాయం అనే నాలుగు రాష్ట్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, హోం, న్యాయ శాఖలకు చెందిన మరో ఇద్దరు అధికారులు సభ్యులుగా ఉంటారు. కమిటీ తన నివేదికను సమర్పించడానికి ఎలాంటి గడువును విధించలేదు. మహారాష్ట్రలోని 48 పార్లమెంటరీ సెగ్మెంట్లలో 14 చోట్ల బలవంతపు మతమార్పిడులు జరిగాయని ఆ సమయంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ గత ఏడాది లోక్ సభ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. అనేక హిందూ మితవాద సంస్థలు, అలాగే నితేష్ రాణే వంటి బిజెపి నాయకులు “లవ్ జిహాద్“కు వ్యతిరేకంగా గళమెత్తారు. గత మహాయుతి ప్రభుత్వం లవ్ జిహాద్ కేసుల విచారణకు అప్పట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసినా పెద్దగా పురోగతి కనిపించలేదు.