ఎఫీషియెన్సీ తక్కువగా ఉన్న ఉద్యోగులను తొలగించి, డబ్బులు ఆదా చేసుకోవాలని చూస్తున్నట్టు డాడ్జ్​​ టీమ్​, ట్రంప్​ యంత్రాంగం గత కొంతకాలంగా చెబుతూ వస్తోంది. ఇందులో భాగంగానే దాదాపు 20లక్షల మంది ఫెడరల్​ ఉద్యోగులకు ‘బైఔట్​’ ప్రోగ్రామ్​ ఎంచుకునే ఆప్షన్​ని ఇచ్చింది ట్రంప్​ బృందం. నిర్దిష్ట తేదీలోగా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే, సెప్టెంబర్​ 30 వరకు సంబంధించిన జీతాలు ఇస్తామని ఆ ప్రోగ్రామ్​లో చెప్పింది. ఇప్పటివరకు 75వేల మంది ఈ ప్రోగ్రామ్​ని ఆప్ట్​ చేసుకుని ఉద్యోగాల నుంచి వైదొలిగారని సెమాఫోర్​ నివేదిక తెలిపింది. “మీరు రాజీనామా చేయకపోతే, భవిష్యత్తులో మీ ఉద్యోగాలకు 100శాతం హామీ ఉంటుందని చెప్పలేము,” అని సదరు ప్రోగ్రామ్​లో రాసి ఉండటం ఇందుకు కారణం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here