హీరోయిన్గా…నిర్మాతగా…
కథానాయికగా దక్షయజ్ఞం, జీవనజ్యోతి, భీష్మ, ఆహుతి, గొల్లభామ, మళ్లీ పెళ్లి, తిరుబాటు, పేరంటాలుతో పాటు పలు సినిమాలు చేసింది కృష్ణవేణి. నిర్మాతగా మనదేశంతో పాటు లక్ష్మమ్మ, భక్త ప్రహ్లాద, దాంపత్యం సినిమాలను తెరకెక్కించింది. బాలమిత్రుల కథ, కీలు గుర్రం సినిమాల కోసం గాయనిగా మారింది. కథానాయికగా కొనసాగుతోన్నప్పుడే కృష్ణవేణికి మీర్జాపురం రాజా వారితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అతడినే పెళ్లిచేసుకున్నది.