తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన హీరోగా నటించిన చాలా తమిళ చిత్రాలు.. తెలుగు డబ్బింగ్లో ఇక్కడ మంచి కలెక్షన్లు దక్కించుకున్నాయి. అంతలా తెలుగు ప్రేక్షకుల్లో సూర్యకు క్రేజ్ ఉంది. అయితే, సూర్య ఇప్పటి వరకు డైరెక్ట్ తెలుగు మూవీ ఒక్కటే చేశారు. రామ్గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన రక్తచరిత్ర-2 (2010)తో తెలుగులోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మళ్లీ డైరెక్ట్ తెలుగు చిత్రం చేయలేదు. ఆ నిరీక్షణకు ఇక తెరదించారు. ఇప్పుడు మళ్లీ ఓ స్ట్రైట్ తెలుగు చిత్రానికి సూర్య ఓకే చెప్పారని సమాచారం.
Home Entertainment Suriya: 15ఏళ్ల తర్వాత స్ట్రైట్ తెలుగు సినిమా చేయనున్న తమిళ హీరో సూర్య.. డైరెక్టర్ ఎవరంటే..