ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ను ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఆదివారం మధ్యాహ్నం మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పవన్‌కళ్యాణ్‌తో రాజేంద్రప్రసాద్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు పలు విషయాల గురించి చర్చించుకున్నారు. నటుడుగా సుదీర్ఘమైన కెరీర్ కలిగిన రాజేంద్రప్రసాద్‌కు మెగాస్టార్ చిరంజీవితో మంచి అనుబంధం ఉంది. అలాగే పవన్‌కళ్యాణ్‌తో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్‌కళ్యాణ్‌ను ఆయన కలుసుకోవడం విశేషాన్ని సంతరించుకుంది. ముందుగా పవన్‌కళ్యాణ్‌ను శాలువాతో సత్కరించారు రాజేంద్రప్రసాద్. ఆ తర్వాత ప్రేమ పూర్వకంగా ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. ఈ ప్రత్యేక భేటీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.