ఉత్తమ మన్వంతరము నందు ఋషులు వశిష్ఠపుత్రులైన ఏడుగురు. హిరణ్యగర్భుని కుమారులు ఊర్థులు. ఉత్తముని కుమారులు పదిమంది. వారు ఇషుడు, ఊర్జస్సు, తనూర్ఖుడు, మధువు, మాధవుడు, శుచి, శుక్రుడు, సహుడు, నభస్యుడు, నభుడు. దేవతలు భానువులు.తామస మన్వంతరమునందు సప్తర్షులు కావ్యుడు, పృథువు, అగ్ని, జహ్నువు, ధాత, కపీనంతుడు, అకపీవంతుడు. దేవతలు ద్యుతి, తపస్యుడు, సుతపుడు, తపోభూతుడు, సనాతనుడు, తపోరతి, అకల్మాషుడు, తన్వి, ధన్వి, పరంతపుడు.