అందంగా, ఆరోగ్యంగా ఉండటానికి నోరు, దంతాలు ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. దంతాల కోసం బ్రష్ చేయడంతో పాటు మౌత్ వాష్, ఫ్లాసింగ్ కూడా చాలా అవసరం. వీటి నోటి దుర్వాసన నుంచి తప్పించుకోవడంతో పాటు దంతాలపై పేరుకుపోయే క్రిముల నుండి చక్కటి ఉపశమనం లభిస్తుంది. కానీ మార్కెట్లో దొరికే మౌత్ వాష్ లను ఉపయోగించడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వీటిని ఉపయోగించడం వల్ల కొందరికి నోటిలో మంట వంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. పైగా వీటిలో ఎలాంటి రసాయనాలు కలిస్తాయో అన్న భయం కూడా మరో కారణం. అందుకే మార్కెట్లో దొరికే మౌత్ వాష్ లను ఉపయోగించే బదులు ఇంట్లోనే మీరు స్వయంగా తయారు చేసుకుని వాడటం ఉత్తమం. ముఖ్యంగా పిల్లల నోటిలో క్యావిటీలను నివారించడానికి, ఇంట్లో తయారుచేసిన ఈ మౌత్వాష్‌లు ఉపయోగించండి చాలా సేఫ్. ఇది దంతాలతో పాటు చిగుళ్ళను కూడా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇంట్లోనే మౌత్ వాష్ లను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి.