Guntur Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నారాకోడూరు-బుడం పాడు గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. వ్యవసాయ పనుల కోసం ఆటోలో వెళుతున్న మహిళలు ప్రమాదానికి గురయ్యారు. ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న మహిళలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. ముగ్గురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురిని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిని సుద్దపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Home Andhra Pradesh గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం,వ్యవసాయ పనులకు వెళుతుండగా ప్రమాదం, ముగ్గురు మహిళల దుర్మరణం-three women killed...