గూగుల్ పిక్సెల్ 8ఏ కొనాలా?
గూగుల్ పిక్సెల్ 9ఏ అప్‌గ్రేడెడ్ ఫీచర్స్‌తో వస్తుందని అంచనాలు ఉన్నప్పటికీ.. పిక్సెల్ 8ఏ కూడా.. ప్రస్తుత డిస్కౌంట్ ధరలో మంచి ఆప్షన్‌గా మారింది. 6.1 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. పిక్సెల్ 8ఏలో 8 జీబీ ర్యామ్, గూగుల్ టెన్సర్ జీ3 చిప్ వంటివి ఉన్నాయి. ఇది ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్, అధునాతన ఏఐ ఫీచర్లను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 7 ప్రైమరీ ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్కి కూడా అర్హత కలిగి ఉంది.