తనదైన నటనతో ప్రేక్షకుల్నిఅభిమానులుగా మార్చుకునే హీరోయిన్ ‘సాయిపల్లవి'(Sai Pallavi)రీసెంట్ గా ‘తండేల్'(Thandel)తో మరోసారి భారీ విజయాన్ని అందుకుంది.’సత్య’ అనే క్యారక్టర్ లో ఆమె నటించిన తీరుకి ప్రతి ఒకరు జేజేలు పలుకుతున్నారు.ఇక అభిమానులు సాయిపల్లవి కి నేషనల్ అవార్డు రావాలని ఎప్పట్నుంచో కోరుకుంటున్న విషయం తెలిసిందే.ఇప్పుడు సాయి పల్లవి కూడా తన అభిమానుల దారిలోనే తన మనసులోని మాటని వెల్లడి చేసింది.
సాయిపల్లవి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు ‘జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది.నిజానికి ఎప్పట్నుంచో ఈ అవార్డు కోసం ఎదురుచూస్తున్నాను.మా అమ్మమ్మ నాకు 21 ఏళ్ళ వయసున్నప్పుడు ఒక చీర ఇచ్చి నా పెళ్ళికి కట్టుకోమని చెప్పింది.అప్పుడు నేను ఇంకా సినిమాల్లోకి రాలేదు.కాబట్టి పెళ్ళిలో కట్టుకుందామని అనుకున్నాను.ఆ తర్వాత మూడేళ్ళకి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది.నా మొదటి సినిమా ‘ప్రేమమ్’ చేస్తున్నప్పుడే ఏ రోజైన నేషనల్ అవార్డు వస్తుందని అనుకున్నాను.దాంతో అమ్మమ్మ ఇచ్చిన చీర కట్టుకొని అవార్డు ప్రదానోత్సవానికి హాజరుకావాలని ఫిక్స్ అయ్యాను.ఒక వేళ అవార్డు రాకపోయినా కూడా చీర కట్టుకోవాలనే ఒత్తిడి ఉంటుందని చెప్పుకొచ్చింది.
నిజానికి సాయి పల్లవికి ‘గ్యారీ’ మూవీకి గాను నేషనల్ అవార్డు వస్తుందని అందరు అనుకున్నారు.అంతలా ఆ సినిమాలో తన నటనతో మెస్మరైజ్ చేసింది.కానీ చివరి నిమిషంలో ఆ అవార్డు వేరే వాళ్ళని వరించింది.ఇక ఆమె ప్రస్తుతం హిందీలో రామాయణ(Ramayana)మూవీ చేస్తుంది.పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘సీతమ్మ తల్లి’ క్యారక్టర్ చేస్తుండటంతో, ఈసారి నేషనల్ అవార్డు అందుకోవడం పక్కా అని అభిమానులు చెప్తున్నారు.కొంత మంది అభిమానులైతే ‘తండేల్’ కే వస్తుందంటున్నారు.’ఏక్ దిన్'(Ek din)అనే మరో హిందీ మూవీ కూడా సాయిపల్లవి చేస్తుంది.