మాస్ మహారాజా రవితేజ(Ravi Teja)హరీష్ శంకర్(Harish Shankar)కాంబోలో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ‘మిస్టర్ బచ్చన్'(Mister Bachchan)ఈ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన నార్త్ ఇండియన్ భామ’భాగ్య శ్రీ బోర్సే'(BHagyashri Borse)మిస్టర్ బచ్చన్ రిజల్ట్ ఎలా ఉన్నాకూడా గ్లామర్ పరంగాను,పెర్ ఫార్మెన్స్ పరంగాను  భాగ్యశ్రీకి మంచి మార్కులే పడ్డాయి.

ఇప్పుడు భాగ్యశ్రీ స్టార్ హీరో సూర్య(Suriya)తో జత కట్టనుందనే ప్రచారం సినీ సర్కిల్స్ లో జోరుగా వినపడుతుంది.లేటెస్ట్ గా ‘లక్కీ భాస్కర్'(Lucky BHaskar)తో హిట్ ని అందుకున్న’వెంకీ అట్లూరి'(Venki atluri)తో సూర్య ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి.ఇప్పుడు ఈ మూవీలోనే భాగ్యశ్రీ  హీరోయిన్ గా చెయ్యబోతుందని,ఈ మేరకు భాగ్యశ్రీ ని కలిసి వెంకీ స్టోరీ చెప్పాడని,ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.మే లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతుందనే వార్తలు కూడా వస్తున్న ఈ చిత్రాన్నిసితార ఎంటర్ టైన్మేంట్ నిర్మించబోతోంది.

ఇక కెరీర్ పరంగా చూసుకుంటే ‘భాగ్యశ్రీ’కి ఈ ఆఫర్ మంచి అవకాశం అని చెప్పవచ్చు.ఆమె ఇప్పటికే ‘దుల్కర్ సల్మాన్’ తో కాంత, రామ్ పోతినేని(Ram Pothineni)తో ఒక మూవీ చేస్తుంది.ఈ రెండు చిత్రాలకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో భాగ్య శ్రీ తన అందంతో కట్టిపడేయ్యడమే కాకుండా,తన క్యారెక్టర్స్ పై ప్రేక్షకుల్లో ఆసక్తిని కూడా కలగ చేసింది.ఈ లెక్కన భాగ్యశ్రీ ఫ్యూచర్ లో టాప్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉందని పలువురు సినీ మేధావులు అభిప్రాయపడుతున్నారు.విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri)కాంబోలో తెరకెక్కుతున్న ‘కింగ్ డమ్’ లోను భాగ్యశ్రీ నే హీరోయిన్ అనే ప్రచారం జరుగుతుంది.

 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here