ఢిల్లీలో ఈ ఉదయం భూకంపం సంభవించింది. దేశ రాజధాని ఢిల్లీతో NCR ప్రాంతంలో ఉదయం 5.36 గంటలకు భూమి కంపించింది. భయబ్రాంతులకు లోనైన జనం రోడ్లపైకి పరగులు తీశారు. రెక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఢిల్లీకి సమీపంలోనే 5 కిలోమీటర్ల లోతులో ఉండటం గమనార్హం. అయితే ఎవరికీ ఎలాంటి నష్టం కలగలేదు. ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోని నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో కూడా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here