పూరీలంటే ఇష్టపడని వారు ఉండరు. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టంగా తింటారు. కానీ ఇందులోని మైదా కారణంగా ఆరోగ్యం గురించి కాస్త భయపడతారు. ముఖ్యంగా పిల్లల విషయంలో.. పూరీలు అనగానే పిల్లలు ఎగబడీ మరీ తినేస్తుంటారు. వీటిలోని మైదా వారి ఆరోగ్యాన్ని ఎక్కడ పాడు చేస్తుందో అని తల్లిదండ్రులు కంగారు పడుతుంటారు. మీ ఇంట్లో కూడా ఇదే జరుగుతుంటే ఈ రెసిపీ మీ కోసమే. మైదా లేకుండానే రుచికరమైన ఆరోగ్యకరమైన పూరీలను తయారు చేసి ఇంట్లో వాళ్లకు పెట్టచ్చు. వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసమైనా, సాయంత్రం స్నాక్స్ సమయంలో అయినా చేసి పెట్టచ్చు. ఆరోగ్యకరమైన మెంతి ఆకులు, గోధుమపిండితో తయారు చేసే మేతీ మసాలా పూరీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.