సినిమాల్లోను,రాజకీయాల్లోను ఎంతో భవిష్యత్తు ఉన్న నందమూరి తారకరత్న(Taraka Ratna)2023 ఫిబ్రవరి 18న గుండెపోటుతో అకాలమరణం చెందిన విషయం తెలిసిందే.నేటికీ సరిగ్గా రెండు సంవత్సరాలు అవుతుంది.ఈ సందర్భంగా తారకరత్న సతీమణి అలేఖ్య(Alekhya)సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది.
అలేఖ్య ఇనిస్టాగ్రమ్ వేదికగా పోస్ట్ చేస్తు’ విధి మా నుంచి నిన్ను దూరం చేసింది.ఈ గాయాన్నికాలం కూడా మాన్పించలేదు.బద్దలైన గుండె మళ్లీ అతకలేదు. మనం విడిపోకుండా ఉండాల్సింది.నువ్వు వెళ్లిపోతు మిగిల్చిన శూన్యాన్ని ఈ ప్రపంచంలో ఇంకేది భర్తీ చేయలేదు. మాతో నువ్వు ఉండకపోవచ్చు. కానీ నీ ప్రభావం మా జీవితాల మీద ఉంటుంది.మా కలలో ఎప్పటికీ బతికే ఉంటావు.నువ్వు లేవనే బాధను మాటల్లో చెప్పలేను.మిస్ యూ’ అంటూ పోస్ట్ చేసింది.
అలేఖ్య ,తారకరత్న లు 2012 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అలేఖ్య కొన్ని సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పని చేసింది.ఇద్దరకీ ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు