అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘పుష్ప-2’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలై.. సంచలన వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ సినిమా 32 రోజుల్లో రూ.1831 కోట్ల గ్రాస్ తో ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందని గతంలో మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఓటీటీలో అడుగుపెట్టిన పుష్ప-2.. అక్కడా రికార్డు వ్యూయర్ షిప్ తో దూసుకుపోతోంది. మరోవైపు థియేటర్లలో కూడా ఇక రన్ పూర్తయినట్టే లెక్క. ఈ క్రమంలో తాజాగా మేకర్స్.. పుష్ప-2 ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్ ను అనౌన్స్ చేశారు.
‘పుష్ప-2’ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1871 కోట్ల గ్రాస్ రాబట్టిందని తెలుపుతూ తాజాగా నిర్మాతలు ఒక పోస్టర్ ను విడుదల చేశారు. దీంతో ‘బాహుబలి-2’ని బీట్ చేసిన ‘పుష్ప-2’ అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. బాహుబలి-2 ఫుల్ రన్ లో రూ.1871 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ‘పుష్ప-2’ రూ.1871 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు మేకర్స్ చెబుతున్నారు. ఆ లెక్కన బాహుబలి-2 ని పుష్ప-2 ని క్రాస్ చేసినట్లే. కానీ ట్రేడ్ వర్గాలు మాత్రం పుష్ప-2 సినిమా రూ.1600 నుంచి రూ.1800 కోట్ల మధ్య కలెక్ట్ చేసిందని అంచనా వేస్తున్నాయి. ట్రేడ్ లెక్కల ప్రకారం చూస్తే మాత్రం.. పుష్ప-2 ఇంకా బాహుబలి-2 ని బీట్ చేయలేదు.