స్టార్ హీరోయిన్ సమంత(Samantha)నుంచి గత ఏడాది ఎలాంటి తెలుగు చిత్రం ప్రేక్షకుల ముందుకి రాలేదు.కానీ ‘సిటాడెల్ హనీ బన్నీ'(Citadel Honey Bunny)అనే వెబ్ సిరీస్ తో మాత్రం తన అభిమానులతో పాటు ప్రేక్షకులని అలరించింది. నవంబర్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అయిన సిటాడెల్ కి ‘రాజ్ అండ్ డీకె'(Raj&dk)ద్వయం దర్శకత్వం వహించింది.యాక్షన్ తో పాటుస్ప్రై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో సమంత ఎన్నో రిస్కీ ఫైట్స్ ని కూడా చేసింది.
ఇప్పుడు ఈ సిరీస్ కి ‘ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్'(Ikon Gold Awards)లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది.2020 లో ఏర్పాటయిన ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ హిందీ చిత్ర రంగంతో పాటు టెలివిజన్ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన సినిమాలకి,వెబ్ సిరీస్ లకి రకరకాల విభాగంలో అవార్డుల్ని ఇస్తుంది.ఈ కోవలోనే ఇప్పుడు ‘సిటాడెల్ హనీ బన్నీ’ ని ప్రకటించింది.ఈ విషయంపై దర్శకుల్లో ఒకరైన డీకె ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేస్తు సిటాడెల్ వెనుక ఎంతో మంది కృషి ఉంది.అవార్డుతో మీరు చూపించిన ప్రేమకి ధన్యవాదాలు అంటు ట్వీట్ చేసాడు.అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఈ సిరీస్ అందుబాటులో ఉంది.వరుణ్ ధావన్ హీరోగా చేసాడు.