మేడ్చల్ జిల్లా కేంద్రంలో నిబంధనలు అతిక్రమించి ఇళ్ల నిర్మాణం చేశారని HMDA అధికారులు కూల్చి వేశారు.జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ వార్డు అరుంధతి నగర్ లో కూల్చివేతలు జరిగాయి. పోలీసు బందోబస్తు నడుమ 15 ఇళ్లను హెచ్ఎండీఏ అధికారులు తొలగించారు. మీ కాళ్లు మొక్కుతా.. మా గరీబోల్ల ఇళ్లు కూలగొడితే ఏమొస్తది సార్ అని ఇళ్ల యజమానులు బోరున విలపించారు.