జనసేన స్థానిక ఇన్‌ఛార్జి కిరణ్ రాయల్ వ్యవహారంలో మరో క్లిప్ బయటకు వచ్చింది. తన నుంచి డబ్బు తీసుకుని మోసం చేసినట్లు లక్ష్మి అనే బాధితురాలు వరుసబెట్టి ఆధారాలు వదులుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమ్మాయిల గురించి అసభ్యకరంగా కిరణ్ మాట్లాడారని చెబుతున్న ఆడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది.