తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే తెలియని వారుండరు. ఆయన చేసే పనుల కన్నా.. మాట తీరే జనాల్లోకి ఎక్కువగా వెళ్తోంది. పేద, మధ్య తరగతి ప్రజలతో మమేకం అయ్యేటప్పుడు వారి పల్లెటూరి భాషలోనే పలుకరించటం, బాగోగులు తెలుకోవటం ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక. ఆయన బాటలతో కొత్తగా ఎమ్మెల్యే అయిన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి నడుస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడ పాల్గొన్న తనదైన శైలిలో ప్రజల్తో మమేకం అవుతున్నారు. కొన్ని రోజుల క్రితం నియోజకవర్గంలోని ఇగుడూరు, పులిప్రొద్దుటూరు గ్రామ సభల్లో పాల్గొన్న సందర్భంగా ఆసాంతం నవ్వులు పూయించారు.