కావాల్సిన పదార్థాలు:
- ¼ కప్పు రాగి పిండి
- 3/4 కప్పు పెరుగు
- 1 టేబుల్ స్పూన్ నెయ్యి
- 1 టేబుల్ స్పూన్ జీలకర్ర
- 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు
- ఉప్పు రుచికి తగినంత
- 500ml నీరు
- కరివేపాకు/కొత్తిమీర
- ఇంగువ (ఆప్షనల్)
తయారీ విధానం
- స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో 300ml నీరు పోసుకోండి.
- నీరు కాస్త వేడెక్కిన తర్వాత అందులో రాగి పిండి ఉండలు చుట్టుకోకుండా కలుపుతూ పోయండి.
- పిండి పోసిన ఆ ద్రావణం చిక్కపడేంత వరకూ మరిగించండి.
- ఇప్పుడు కాసేపు చల్లారనివ్వండి.
- అందులో పెరుగు వేసి, రుచికి తగినంత ఉప్పు, నీరు కలుపుకోండి.
- ఇప్పుడు నెయ్యి, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర వేయండి.
- అవన్నీ కలిసేలా బాగా తిప్పండి. అంతే రాగి కంజి రెడీ అయినట్లే.
- దీనిని ఫ్రిజ్ లో ఉంచుకుని లేదా అలా ఉండగానే సర్వ్ చేసుకోవచ్చు.
మీరు డైటింగ్ చేస్తున్నట్లయితే రాగులతో చేసిన ఈ రాగి కంజి మంచి ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్. మీరు డైటింగ్ లో లేకపోయినా సరే వారానికి ఒకసారి కచ్చితంగా తీసుకోదగిన ఆహారం ఇది. పోషకాహారమైన ఈ రాగికంజి చాలా ఆరోగ్యకరమైనది. రాగుల్లో ఉండే ఫైబర్, ప్రొటీన్, మినరల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.