గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)మొన్న సంక్రాంతికి ‘డాకు మహారాజ్'(Daku Maharaj)గా వచ్చి,మరోసారి తన కెరీర్ లో  బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.దీంతో తన అప్ కమింగ్ మూవీ ‘అఖండ 2 ‘(Akhanda 2)పై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు.పైగా అఖండ పార్ట్ 1 కి సీక్వెల్ గా తెరకెక్కుతుండటంతో అభిమానులతో పాటు,ప్రేక్షకుల్లోను అఖండ 2 పై అంచనాలు అంబరాన్నంటాయని చెప్పవచ్చు. మేకర్స్ కూడా పార్ట్ 1 ని మించి ఉండబోతుందని చెప్పడంతో ఇప్పట్నుంచే అఖండ 2 కోసం అభిమానులు ఎదురుచూస్తు ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇక అఖండ 2 లో వర్సటైల్ నటుడు అది పినిశెట్టి నటించబోతున్నాడనే వార్తలు గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్నాయి.ఈ మేరకు చిత్ర బృందం నుంచి త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు.ఇప్పుడు తాజాగా బాలీవుడ్ అగ్రనటుడు సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడనే వార్త సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.మేకర్స్ ఇప్పటికే  సంజయ్ దత్ కి కథ చెప్పారని,ఈ మేరకు సంజయ్ దత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని  అంటున్నారు.ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సంజయ్ రోల్ ఏమయ్యిఉంటుందనే చర్చ జరుగుతుంది.ఎందుకంటే ఎలాంటి రోల్ లో అయినా  సంజయ్ దత్  విజృంభించి నటించగలడు.ఇందుకు ఆయన గత చిత్రాలే ఉదాహరణ. అఖండ 2 కి  సంజయ్ దత్ రాక ప్లస్ పాయింట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

 దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu)అఖండ మొదటి భాగాన్ని మించి పార్ట్ 2 ని హిట్ చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు.కొన్ని రోజుల క్రితం ప్రస్తుతం యుపిలో జరుగుతున్న మహా కుంభ మేళ లో కొన్ని కీలక సన్నివేశాలని కూడా చిత్రీకరించడం జరిగింది.రేపు థియేటర్స్ లో ఈ సీన్స్ అభిమానులకి,ప్రేక్షకులకి గూస్ బంప్స్ తెప్పిస్తాయని మేకర్స్ ఇప్పటికే చెప్పడం జరిగింది.14 రీల్స్,తో కలిసి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని(Tejaswini)నిర్మిస్తున్న ఈ మూవీకి  థమన్(Thaman)సంగీతాన్ని అందిస్తున్నాడు.ప్రగ్య జైస్వాల్(Pragya Jaiswal)విరూపాక్ష ఫేమ్ సంయుక్త మీనన్(samyuktha Menon)హీరోయిన్లు కాగా విజయదశమి(Vijaya Dasami)కానుకగా  సెప్టెంబర్ 25 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here